ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ కొడుకు ఆ మూవీ చేయనున్నాడా?

Wed, Aug 17, 2016
గౌతమ్
గౌతమ్
తాజాగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. 'అల్లూరి సీతారామరాజు' ఫ్రీక్వెల్ లో మహేశ్ బాబు తనయుడు గౌతమ్ నటించనున్నాడనేదే ఆ వార్త సారాంశం. గతంలో కృష్ణ నటించిన 'అల్లూరి సీతారామరాజు' చిత్రం ఘన విజయాన్ని సాధించింది. కృష్ణ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. అలాంటి ఈ సినిమాకి ఫ్రీక్వెల్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.

అల్లూరి సీతారామరాజు బాల్యానికి సంబంధించిన విశేషాలు .. బాల్యంలో ఆయనకి ఎదురైన సంఘటనలతో ఈ కథ కొనసాగనుందని చెబుతున్నారు. ఈ ఫ్రీక్వెల్ కి రచయిత నడిమింటి నరసింగరావు కథను సిద్ధం చేసి, కృష్ణ - మహేశ్ బాబులకి వినిపించాడట. వాళ్ల గ్రీన్ సిగ్నల్ కోసం ఆయన వెయిట్ చేస్తున్నట్టు చెబుతున్నారు. అదే నిజమైతే పూర్తిస్థాయి బాలనటుడిగా గౌతమ్ ప్రేక్షకుల ముందుకు వస్తాడన్నమాట.
X

Feedback Form

Your IP address: 54.205.89.199
Movie News (Latest)