ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

క్రైమ్ థ్రిల్లర్ గా 'డి -16'

Wed, Aug 17, 2016
రెహమాన్
రెహమాన్
తమిళంలో ఒక క్రైమ్ థ్రిల్లర్ రూపొందింది. రెహమాన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా పేరే 'ధురువంగల్ పథినారు' (డి -16). ఈ సినిమాలో రెహమాన్ ద్విపాత్రాభినయం చేశాడు. పోలీస్ ఆఫీసర్ గానే కాకుండా, మరో కీలకమైన పాత్రను ఆయన పోషించాడు.

ఒక నేరానికి సంబంధించిన కేసు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నేరం జరిగిన 16 గంటల్లో 16 మంది అనుమానితులను ఎలా గుర్తించారు? ఎలా పట్టుకున్నారు? అనే ఆసక్తికరమైన కథా కథనాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. కార్తీక్ అనే 22 యేళ్ల కుర్రాడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. తాజాగా రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్, ఈ సినిమా పట్ల మరింత ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)