ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'పెళ్లి చూపులు' దర్శకుడి డైలమా!

Wed, Aug 17, 2016
తరుణ్ భాస్కర్
తరుణ్ భాస్కర్
ఈ రోజుల్లో ఒక్క సినిమా హిట్టయితే చాలు ... హీరోలనైనా, దర్శకులనైనా అది ఎక్కడికో తీసుకుపోతుంది. ముఖ్యంగా మంచి హిట్ కొట్టిన దర్శకుడికి హీరోలు, నిర్మాతలు బ్రహ్మరథం పడతారు. తాజాగా తరుణ్ భాస్కర్ పరిస్థితి కూడా అలాగే వుంది. అనూహ్యమైన విజయం సాధించిన 'పెళ్లి చూపులు' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన తరుణ్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ కేక్. చాలా మంది హీరోలు, నిర్మాతలు ఆయనతో చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు.

మరోపక్క, ఈ తెలుగు చిత్రాన్ని వీక్షించిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ముగ్ధుడయ్యాడు. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సిద్ధపడిన సల్లూ భాయ్, దానికి దర్శకత్వం వహించమని తరుణ్ ని రిక్వెస్ట్ చేశాడు. అయితే, ఈ దర్శకుడు ఇప్పుడు పెద్ద డైలమాలో పడ్డాడు. తన తదుపరి చిత్రాన్ని ఎవరితో చేయాలన్న విషయంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నాడట.

హిందీ రీమేక్ చేయాలంటే మరో ఏడాది అదే సినిమాపై వర్క్ చేయాల్సి ఉంటుందని ఫీలవుతున్నాడు. ఈ క్రమంలో టాలీవుడ్ లోనే తన కెరీర్ని కొనసాగించాలన్న ఆలోచనలో కూడా వున్నాడు. అయితే, తన తదుపరి చిత్రంగా ఏ హీరో చిత్రాన్ని ఒప్పుకోవాలన్న మీమాంస కూడా వుంది. అందుకే, ఇంకా ఏ చిత్రానికీ ఈయన కమిట్ కాలేదని, ప్రస్తుతం స్క్రిప్ట్ తయారుచేసుకుంటున్నాడని సమాచారం.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)