ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ప్రభాస్ అంతలా కష్టపడుతున్నాడట!

Wed, Aug 17, 2016
ప్రభాస్
ప్రభాస్
'బాహుబలి' సృష్టించిన సంచలనం ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ను తెచ్చిపెట్టింది. దాంతో ఆయన రెండవభాగం కోసం మరింతగా కష్టపడుతున్నాడు. మొదటిభాగంలో ఎలాంటి పర్సనాలిటీతో .. ఎలాంటి లుక్ తో కనిపించాడో, అలాంటి లుక్ లోనే కనిపించడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. మొదటి భాగంలో శివుడుగాను .. బాహుబలిగాను ప్రభాస్ రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించాడు.

ఈ రెండు పాత్రల్లో మళ్లీ అదే విధంగా కనిపించడం కోసం ఆయన ప్రతి రోజు వర్కౌట్స్ చేస్తూ 20 కేజీల బరువు పెరిగాడు. అలా ఇటు వర్కౌట్స్ కోసం .. అటు షూటింగ్ కోసం ఆయన రోజుకి 16 గంటలపాటు కష్టపడుతున్నాడని చెబుతున్నారు. ఇక రెండవ భాగంలో ఆయన ఎక్కువ సేపు 'బాహుబలి'గానే కనిపించనున్నాడని అంటున్నారు. ఈ భాగంతో ప్రభాస్ క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోవడం ఖాయమని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.121.63
Movie News (Latest)