ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆకట్టుకుంటున్న కాజల్ ఐటెం సాంగ్ సెట్!

Wed, Aug 17, 2016
కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్
కొరటాల శివ రూపొందిస్తున్న 'జనతా గ్యారేజ్' చిత్రం ఐటెం సాంగు కోసం భారీ ఖర్చుతో అద్భుతమైన సెట్ ను రూపొందించారు. ఆర్ట్ డైరెక్టర్ ఏ.ఎస్.ప్రకాశ్ తీర్చిదిద్దిన ఈ సెట్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. 'నేను పక్కా లోకల్...' అంటూ సాగే ఐటెం సాంగును ప్రస్తుతం ఈ సెట్లో ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ జంటపై చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ నృత్య రీతులను సమకూరుస్తున్నాడు. దీంతో ఇక షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

ఇదిలా ఉంచితే, ఈ నెల 12న విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు 'యూ ట్యూబ్'లో విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు దీనికి 34 లక్షల హిట్స్ వచ్చాయి. అలాగే జూక్ బాక్స్ కు 10 లక్షల హిట్స్ లభించాయి. ఈ నేపథ్యంలో చిత్రం యూనిట్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. సెప్టెంబర్ 2న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)