ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కాజల్ కి అలాంటి ఫ్యామిలీస్ ఇష్టమట!

Tue, Aug 16, 2016
కాజల్
కాజల్
ఉమ్మడి కుటుంబాలు అంటే తనకి ఎంతో ఇష్టమని కాజల్ చెబుతోంది. అంతేకాదు ఇంటికి బంధువులొస్తే కలిగే ఆనందమే వేరని అంటోంది. తన చిన్నప్పుడు చిన్న ఫంక్షన్ జరిగినా చాలా పెద్ద సంఖ్యలో బంధువులు వచ్చేవారట. ఇక స్కూల్లో తనకి ఏదైనా బహుమతి ప్రదానం జరిగితే, ఆ వేడుకను తిలకించడానికి తన వెంట చాలామంది బంధువులు వచ్చేవారని చెబుతోంది.

మన అనుకునే వాళ్లు వెంట వచ్చినప్పుడు సహజంగానే ధైర్యం ఎక్కువగా ఉంటుందని చెబుతోంది. ఆ ధైర్యమే మరో గెలుపుకి కారణమవుతుందని అంటోంది. ఆశలు నిజం చేసుకోవడానికి .. ఆశయాలు నెరవేర్చుకోవడానికి కలిసి ఉండటం ఎంతో అవసరమని అంటోంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచి .. విజయాలను అందించే ఉమ్మడి కుటుంబాలను తాను ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటానని చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)