ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కమల్ కి ఇష్టమైన 'కార్నర్' అది!

Tue, Aug 16, 2016
కమలహాసన్
కమలహాసన్
కమలహాసన్ కథానాయకుడిగా ఆయన దర్శక నిర్మాతగా 'శభాష్ నాయుడు' చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా మరో నెల రోజుల్లో తదుపరి షెడ్యూల్ ను ఆరంభించవచ్చని అంతా అనుకున్నారు. కానీ తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదనీ, తదుపరి షెడ్యూల్ కి రెండు నెలల సమయం పట్టవచ్చని కమల్ అన్నారు.

తనకి జరిగిన ప్రమాదం గురించి మాట్లాడుతూ ఆయన ఈ మాట చెప్పారు. కమల్ పడిపోయారనే వార్త బయటికి వస్తే, ఆయన మేడ మెట్లపై నుంచి జారి పడిపోయారని అనుకున్నారు. కానీ ఆయన తన ఆఫీసులోని ఒక కార్నర్ పాయింట్ దగ్గర నుంచి పడిపోయారట. అక్కడి నుంచి చూస్తే రోడ్డుపై జన సంచారం కనిపిస్తూ వుంటుంది. తరచూ ఆయన అక్కడ నిలబడుతూ వుంటారు. అలా నిలబడి ఉండగా హఠాత్తుగా ఆ ప్రదేశం కుంగిపోవడంతో, 18 అడుగుల ఎత్తు నుంచి పడిపోయానని ఆయన చెప్పారు. అదృష్టవశాత్తు బతికాననీ .. లేదంటే చనిపోయేవాడినని అన్నారు.
X

Feedback Form

Your IP address: 54.166.5.76
Movie News (Latest)