ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అమలాపాల్ కి ఇకపై అవకాశాలు వచ్చేనా?

Tue, Aug 16, 2016
అమలాపాల్
అమలాపాల్
అమలాపాల్ విడాకుల వ్యవహారం కొన్ని రోజులుగా మీడియాలో హల్ చల్ చేస్తూనే వుంది. అమలాపాల్ .. ఆమె భర్త విజయ్ ఇద్దరూ కూడా విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే విడాకుల తరువాత అమలాపాల్ కి ఛాన్సులు రావడం కష్టమేననే వార్తలు కోలీవుడ్ లో బలంగా వినిపిస్తున్నాయి.

అమలాపాల్ మావగారు 'అళగప్పన్' నటుడు మాత్రమే కాదు నిర్మాత కూడా. అక్కడి దర్శక నిర్మాతలతో ఆయనకి బాగా పరిచయాలు వున్నాయట. అందువలన అమలాపాల్ కి అవకాశం ఇస్తే, ఆయనతో శత్రుత్వం కొనితెచ్చుకున్నట్టు అవుతుందదేది దర్శక నిర్మాతల ఆలోచన. అమలాపాల్ కోసం ఆయనతో మనస్పర్థలు తెచ్చుకోవడానికి అక్కడి వాళ్లు సిద్ధంగా లేరని చెప్పుకుంటున్నారు. అందువలన విడాకుల తరువాత అమలాపాల్ కి ఎవరైనా పిలిచి ఛాన్స్ ఇస్తారా? అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
X

Feedback Form

Your IP address: 54.211.207.116
Movie News (Latest)