ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నిత్యామీనన్ కు అరుదైన ఆఫర్!

Tue, Aug 16, 2016
నిత్యామీనన్
నిత్యామీనన్
అలనాటి అందాల అభినేత్రి సావిత్రి జీవితంలోని ఉత్థానపతనాలను వెండితెరకు ఎక్కించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. 'ఎవడే సుబ్రమణ్యం' ఫేం నాగ్ అశ్విన్ దర్శకుడిగా వ్యవహరించే ఈ చిత్రంలోని టైటిల్ రోల్ కోసం పలువురుని పరిశీలించారు. బాలీవుడ్ నటి విద్యాబాలన్ ను కూడా సంప్రదించినట్టు వార్తలొచ్చాయి. అయితే, చివరికి నిత్యా మీనన్ ని ఎంచుకున్నట్టు తాజా సమాచారం. నిత్యా అయితేనే ఆ పాత్రకు సరైన న్యాయం చేయగలుగుతుందని భావించిన దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించినట్టు, ఈ పాత్ర పట్ల నిత్యా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాదే సెట్స్ కి వెళుతుంది.
X

Feedback Form

Your IP address: 54.205.54.215
Movie News (Latest)