ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Tue, Aug 16, 2016
* నిత్యా మీనన్, దుల్కర్ సల్మాన్ జంటగా నటించిన '100 డేస్ ఆఫ్ లవ్' అనే మలయాళ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఇటీవలే ఆడియో వేడుకను కూడా జరుపుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 26న తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు.
* వీరభద్రం దర్శకత్వంలో ఆది హీరోగా నటించిన 'చుట్టాలబ్బాయి' చిత్రం పలు వాయిదాల అనంతరం ఈ నెల 19న విడుదల అవుతోంది. ఇందులో నమిత ప్రమోద్ కథానాయికగా నటించింది.
* నారా రోహిత్ కథానాయకుడుగా నటిస్తున్న 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రం షూటింగ్ పూర్తయింది. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రోహిత్ ముస్లిం కుర్రాడిగా కనిపిస్తాడు. వచ్చే నెలలో దీనిని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
* ఇటీవల విడుదలైన చిన్న సినిమా 'పెళ్లి చూపులు' విజయవంతంగా ప్రదర్శితమవుతూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కోటి రూపాయల్లో నిర్మించిన ఈ చిత్రం మొత్తం 15 కోట్ల వరకు వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.161.175.236
Movie News (Latest)