ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ తాజా చిత్రం లేటెస్ట్ ఇన్ఫో!

Mon, Aug 15, 2016
పవన్
పవన్
'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా తర్వాత పవన్ కల్యాణ్ నటించే చిత్రం సెట్స్ కి వెళ్లడానికి చాలా సమయం పట్టింది. మొదట అనుకున్న తమిళ దర్శకుడు ఎస్.జె.సూర్య ఈ ప్రాజక్టు నుంచి తప్పుకోవడం ... తర్వాత డాలీ ఇందులోకి రావడం ... అనంతరం స్క్రిప్టుకి మళ్లీ మార్పులు చేర్పులు చేయడం ... ఇలా రకరకాల కారణాల వల్ల ఇది లేటవుతూ వచ్చింది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. అయితే, పవన్ కల్యాణ్ లేని సన్నివేశాలను ప్రస్తుతం ఇతర తారాగణంపై చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ మరో రెండు రోజుల్లో ఈ షూటింగులో జాయిన్ అవుతాడన్నది తాజా సమాచారం. ఈ సినిమా కోసం ఆయన కొత్త లుక్కును కూడా ట్రై చేస్తున్నాడు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణాన్ని ఐదు నెలల్లో పూర్తిచేసేలా ప్రస్తుతం ప్లాన్ చేశారు.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)