ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కేరళలో 'జనతా గ్యారేజ్' ఆడియో వేడుక!

Mon, Aug 15, 2016
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న 'జనతా గ్యారేజ్' చిత్రం ఆడియో వేడుక ఇటీవల గ్రాండుగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ చిత్రం మలయాళం వెర్షన్ ఆడియో వేడుకను కూడా ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్నందున దీనిని కేరళలో కూడా ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను పెంచి చిత్రానికి అక్కడ హైప్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 26న కొచ్చిలో మలయాళం వెర్షన్ ఆడియో వేడుకను నిర్వహిస్తున్నారు. అయితే, దీనికి ఎన్టీఆర్ హాజరవుతాడా? లేదా? అన్నది ఇంకా తెలియరాలేదు. ఈ చిత్రంలో సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)