ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ కల్యాణ్ కి సిగ్గెక్కువంటున్న చిన్నది!

Mon, Aug 15, 2016
సమంత
సమంత
'పవన్ కల్యాణ్ గారికి బాగా సిగ్గెక్కువ' అంటోంది చెన్నయ్ బ్యూటీ సమంత. ఆ సిగ్గు వల్ల తలెత్తిన ఓ ఇబ్బంది గురించి ఈ ముద్దుగుమ్మ తాజాగా చెప్పుకొచ్చింది. "అత్తారింటికి దారేది సినిమా సాంగ్ షూట్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లాం. అక్కడ షూటింగ్ చేస్తుండగా కాసేపటికి జనం బాగా వచ్చేశారు. దాంతో వాళ్లను చూసి పవన్ బాగా సిగ్గుపడ్డారు. 'ఇంతమంది చూస్తుండగా డ్యాన్స్ చేయడం నా వల్ల కాదు...' అంటూ ఆయన కార్ వాన్ లోకి వెళ్లి కూర్చున్నారు. దాంతో నేను వెళ్లి 'అదేంటి సార్, చుట్టూ ఎంతమంది వున్నా మీరు స్టెప్స్ వేయగలరు. రండి సార్' అంటూ ధైర్యం చెబుతూ బతిమాలాను. ఏమనుకున్నారో గానీ ఆయన వెంటనే బయటకు వచ్చారు. నేను చాలా హ్యాపీ ఫీలయ్యాను. ఆ సంఘటన నాకు ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోతుంది" అని చెప్పింది.

తాను చాలా మంది స్టార్ హీరోలతో కలసి నటించినప్పటికీ పవన్ వారందరిలోకీ స్పెషల్ అని చెప్పింది. "సింపుల్ గా, హుందాగా, పద్ధతిగా వుంటారాయన. అంతటి స్టార్ అయినప్పటికీ అలా ఉండగలగడం చాలా కష్టమండీ" అంటూ పవన్ కి ఈ చిన్నది కాంప్లిమెంట్ ఇచ్చింది.
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)