ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అక్కకి ఫైట్ కంపోజ్ చేసిన యంగ్ హీరో!

Sat, Aug 13, 2016
మనోజ్
మనోజ్
కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో లక్ష్మీ మంచు ప్రధాన పాత్రగా 'లక్ష్మీ బాంబ్' చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను గురించి లక్ష్మీమంచు మాట్లాడుతూ, మూడు రోజుల వర్క్ మినహా, షూటింగ్ పార్టు పూర్తయిందని చెప్పారు. సింగిల్ షెడ్యూల్ లో ఈ సినిమాను దాదాపు పూర్తిచేసేశామని అన్నారు.

గోపాలకృష్ణ పాత్రలను మలచిన తీరు .. కథను తెరకెక్కించిన తీరు ఆసక్తికరంగా ఉంటుందని చెప్పారు. పాటలు .. ఫైట్లు చాలా బాగా వచ్చాయని అన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ ను తన తమ్ముడు మనోజ్ కంపోజ్ చేశాడనీ .. ఈ ఫైట్ హైలైట్ గా నిలుస్తుందని చెప్పారు. 'దీపావళి'కి ముందుగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నామని అన్నారు.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)