ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ముగింపు దశకి చేరుకున్న 'ఆక్సిజన్'

Sat, Aug 13, 2016
గోపీచంద్
గోపీచంద్
గోపీచంద్ కథానాయకుడిగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో 'ఆక్సిజన్' సినిమా రూపొందుతోంది. రాశి ఖన్నా - అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాకి, ఐశ్వర్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆమె మాట్లాడుతూ .. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోందని చెప్పారు.

ఇంతవరకూ 90 శాతం చిత్రీకరణ జరిగిందనీ .. డబ్బింగ్ పనులు కూడా చురుకుగా పూర్తవుతూ వస్తున్నాయని అన్నారు. గోపీచంద్ సినిమా నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలు, 'ఆక్సిజన్'లో వుంటాయని చెప్పారు. సెప్టెంబర్ లో ఆడియో వేడుకను నిర్వహించి, అదే నెలలో సినిమాను విడుదల చేయనున్నామని అన్నారు.
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)