ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అఖిల్ హీరోగా రొమాంటిక్ థ్రిల్లర్?

Sat, Aug 13, 2016
అఖిల్
అఖిల్
అఖిల్ కథానాయకుడిగా ఆయన రెండో సినిమా త్వరలో మొదలుకాబోతోందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడనీ, ఆ విషయాన్ని తన పుట్టినరోజున నాగ్ ప్రకటించనున్నాడని అంటున్నారు.

ఇక ఈ సినిమా రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కనుందనేది తాజా సమాచారం. విక్రమ్ కుమార్ ఈ కథ ఏ హీరోతో చేయాలా అని ఆలోచిస్తూ వున్న సమయంలోనే, నాగార్జున ఆయనని పిలిపించారట. ఆయన వినిపించిన ఆ కథ నచ్చడం వలన .. ఓ మాదిరి బడ్జెట్ తోనే ఈ సినిమా పూర్తవుతుంది కనుక నాగార్జున వెంటనే ఓకే చెప్పేశాడని అంటున్నారు. నాగ్ సొంత బ్యానర్లోనే ఈ సినిమా వుంటుందన్న మాట.
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)