ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇమ్రాన్ హష్మీ తో ఇలియానా

Sat, Aug 13, 2016
ఇలియానా
ఇలియానా
బాలీవుడ్ కథానాయనాకుడిగా ఇమ్రాన్ హష్మీకి ఎంతో క్రేజ్ వుంది. చారిత్రక నేపథ్యం కలిగిన ఒక సినిమాలో ఆయన అజయ్ దేవగణ్ తో కలిసి నటించనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా ఇలియానాను ఎంపిక చేశారు. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాకి, మిలాన్ లూత్రియా దర్శకత్వం వహించనున్నాడు.

గతంలో ఆయన తెరకెక్కించిన 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై' .. 'డర్టీ పిక్చర్' చిత్రాల్లో ఇమ్రాన్ హష్మీ నటించాడు. ఈ రెండు సినిమాలు భారీ వసూళ్లు సాధించాయి. అందువలన ఆయన దర్శకత్వంలో మరోసారి నటించబోతున్నందుకు ఇమ్రాన్ హష్మీ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇక ఈ సినిమాయే కాకుండా మరో మూడు ప్రాజెక్టులపై ఇలియానా సైన్ చేసిందట. 'రుస్తుం' తరువాత ఇలియానా కెరియర్ ఊపందుకున్నట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.204.247.205
Movie News (Latest)