ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సారీ చెప్పిన మోహన్ లాల్

Sat, Aug 13, 2016
'జనతా గ్యారేజ్' లో మోహన్ లాల్ - ఎన్టీఆర్
'జనతా గ్యారేజ్' లో మోహన్ లాల్ - ఎన్టీఆర్
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ తెరకెక్కించిన 'జనతా గ్యారేజ్' ఆడియో వేడుక, నిన్న రాత్రి ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కి అనారోగ్య కారణాల వలన సమంతా .. బిజీగా ఉండటం వలన మోహన్ లాల్ హాజరు కాలేకపోయారు. అయితే తాను రాలేకపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ, మోహన్ లాల్ ఒక వీడియో బైట్ ను పంపించారు.

ఈ ఆడియో వేడుకకి రావడానికి తాను ఎంతగానో ప్రయత్నించాననీ .. బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయానని చెప్పారు. అందుకు తాను ఎన్టీఆర్ అభిమానులందరికీ సారీ చెబుతున్నానని అన్నారు. కేరళలో 'ఓనమ్' పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదల కానుందనీ, అందుకు తనకి ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఎన్టీఆర్ తో కలిసి నటించడం .. కొరటాలతో కలిసి పనిచేయడం తనకి ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)