ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'పెళ్లి చూపులు' పై సల్మాన్ ఆసక్తి!

Fri, Aug 12, 2016
సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పెళ్లి చూపులు' సినిమా, సూపర్ హిట్ చిత్రాల కేటగిరిలో చేరిపోయింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ .. రీతూ వర్మ జంటగా నటించిన ఈ సినిమాను రాజ్ కందుకూరి నిర్మించాడు. ఈ సినిమా బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ఆసక్తిని చూపుతున్నాడని రాజ్ కందుకూరి అన్నాడు.

సల్మాన్ తన బావ ఆయుష్ శర్మ ను ఈ రీమేక్ ద్వారా బాలీవుడ్ కి పరిచయం చేయాలనే ఆలోచనలో వున్నాడని చెప్పాడు. రీమేక్ రైట్స్ విషయంపై సల్మాన్ బంధువైన అతుల్ అగ్నిహోత్రితో చర్చలు జరిపామనీ, మరో వారం రోజుల్లో నేరుగా సల్మాన్ ను కలిసి డీల్ ఖరారు చేసుకుంటామని అన్నాడు. హిందీ వెర్షన్ కి దర్శకత్వం వహించే ఆలోచన మాత్రం తరుణ్ భాస్కర్ కి లేదని ఆయన స్పష్టం చేశాడు.
X

Feedback Form

Your IP address: 54.197.72.5
Movie News (Latest)