ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కృష్ణవంశీని అడగలేదన్న మెగా హీరో!

Fri, Aug 12, 2016
సాయిధరమ్ తేజ్
సాయిధరమ్ తేజ్
సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం 'తిక్క' .. రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉండగా, 'నక్షత్రం' గురించిన ప్రస్తావన కూడా వచ్చింది. కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తుండగా, ఒక ముఖ్యమైన పాత్రలో సాయిధరమ్ తేజ్ కనిపించనున్నాడు.

ఈ సినిమాలో తాను పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాననీ .. తన పాత్ర నిడివి 20 నిమిషాల వరకూ ఉంటుందని మాత్రమే తనకి తెలుసని సాయిధరమ్ తేజ్ అన్నాడు. అంతకి మించి తనకి ఏమీ తెలియదనీ .. తాను కృష్ణవంశీని ఏమీ అడగలేదని చెప్పాడు. తనకి కృష్ణవంశీపై ఎంతో గౌరవం, నమ్మకం ఉన్నాయనీ, అందువల్లనే తాను తన పాత్రకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోలేదని అన్నాడు. ఆయన సినిమాలో ఛాన్స్ రావడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)