ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వెంకటేశ్ అదరగొట్టేశాడట!

Fri, Aug 12, 2016
'బాబు బంగారం'లో వెంకటేశ్
'బాబు బంగారం'లో వెంకటేశ్
'బాబు బంగారం' సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకటేశ్ - నయనతార జంటగా ఈ సినిమాను మారుతి తెరకెక్కించాడు. ఈ సినిమా టాక్ సంగతి అటుంచితే, వెంకటేశ్ నటన వన్స్ మోర్ అనే స్థాయిలో ఉందని చెప్పుకుంటున్నారు. ఏసీపీ కృష్ణగా వెంకటేశ్ చాలా బాగా చేశాడని చెబుతున్నారు.

ఫస్టాఫ్ లో సరదా పోలీస్ ఆఫీసర్ గా హాయిగా నవ్వించిన ఆయన, సెకండాఫ్ లో సీరియస్ గా ఉంటూ అదరగొట్టేశాడని అంటున్నారు. పాత్రలో వేరియేషన్ ని ఆయన అద్భుతంగా చూపించాడని చెబుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ దృశ్యాల్లో ఆయన నటన, విజిల్స్ ను మూటగట్టేస్తోందని అంటున్నారు. విభిన్నమైన ఈ పాత్ర ద్వారా వెంకటేశ్ నూటికి నూరు మార్కులు కొట్టేశాడనే టాక్ బలంగా వినిపిస్తోంది.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)