ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆసక్తిని రేపుతోన్న 'ధ్రువ' ప్రీ లుక్

Fri, Aug 12, 2016
మెగా అభిమానులు చరణ్ తాజా చిత్రమైన 'ధ్రువ' ఫస్టులుక్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఫస్టులుక్ ను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్టుగా చెప్పారు. అదే విషయాన్ని స్పష్టం చేస్తూ, ఈ రోజున ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ లో చరణ్ బ్యాక్ నుంచి కనిపిస్తున్నాడు. ఆయన ఏదో ఆలోచిస్తూ స్కెచ్ గీస్తున్నట్టుగా అనిపిస్తున్నాడు. ఇది 'నా శత్రువే నా బలం' అనే మైండ్ గేమ్ కి సంబంధించిన కాన్సెప్ట్ అనే విషయాన్ని, ఈ పోస్టర్ ద్వారా అర్థమయ్యేలా డిజైన్ చేసిన తీరు బాగుంది. సురేందర్ రెడ్డి క్రియేటివిటీకి మంచి మార్కులు తెచ్చిపెట్టేదిలా ఈ పోస్టర్ వుంది. ప్రీ లుక్ ఇంతలా అదరగొడుతూ ఉందంటే, ఇక ఫస్టు లుక్ ఏ స్థాయిలో ఉంటుందో!
X

Feedback Form

Your IP address: 54.161.209.240
Movie News (Latest)