ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తాగుబోతు పాత్ర గురించి మెగా హీరో

Fri, Aug 12, 2016
'తిక్క'లో  సాయిధరమ్ తేజ్
'తిక్క'లో సాయిధరమ్ తేజ్
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా రూపొందిన 'తిక్క' సినిమా, రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ, ఈ సినిమాలో తాగుబోతు పాత్రను పండించడానికిగాను తాను తీసుకున్న శ్రద్ధను గురించి చెప్పాడు. తాగుబోతులు ఎలా మాట్లాడతారు .. ఎలా ప్రవర్తిస్తారు అనే విషయం తెసులుకోవడానికిగాను పాత సినిమాలు బాగా చూశానని అన్నాడు.

ముఖ్యంగా చిరంజీవి .. పవన్ సినిమాలు చూసి కొంత విషయాన్ని గ్రహించానని చెప్పాడు. ఇక తాగుబోతు రమేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, ఆయన ఇచ్చిన సలహాలు .. సూచనలు తనకి బాగా ఉపయోగపడ్డాయని అన్నాడు. ఈ కారణంగానే తాను తాగుబోతు సన్నివేశాలను పండించగలిగానని చెప్పాడు. కోలీవుడ్ అగ్రకథానాయకులైన ధనుష్ .. శింబు పాడిన పాటలు, ఈ సినిమాకి ప్రత్యేకంగా నిలుస్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)