ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రకుల్ కి కొన్ని లెక్కలున్నాయి మరి!

Fri, Aug 12, 2016
రకుల్
రకుల్
టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి కొన్ని లెక్కలున్నాయట. ఆ లెక్కల ప్రకారమే కొత్త సినిమాలు ఒప్పుకుంటుంది. ముఖ్యంగా ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేముందు అమ్మడికి ఆ కథ నచ్చాలి. అయితే, ఇది అన్ని వేళలా కాదులెండి. ఒక్కోసారి కథ ఏమిటి? అని అడగకుండా కూడా ఒప్పేసుకుంటుంది.
దాని గురించే ఈ చిన్నది చెబుతూ, "టాప్ హీరో, టాప్ డైరెక్టర్ కాంబినేషన్లో ఓ ఆఫర్ వచ్చిందనుకోండి. ఇక అప్పుడు కథేమిటి? నా పాత్రేమిటి? అన్నదే అడగను. డేట్స్ వుంటే వెంటనే ఇచ్చేస్తాను. అసలు అలాంటి కాంబినేషన్ లో సినిమాకి కూడా ఇవన్నీ అడగాలా? ఎందుకంటే, అసలు ఎంతో కసరత్తు చేసి... కథ అందరికీ నచ్చితేనే కదా అలాంటి సినిమా సెట్స్ కి వెళుతుంది. అలాంటి సందర్భాలలో కూడా కథ ఏమిటి? ఎన్ని సీన్లు వుంటాయి? అని అడగడం అవివేకం కదా?" అంటోంది ఈ ముద్దుగుమ్మ.
ఆ విధంగా పెద్ద హీరోలను, పెద్ద డైరెక్టర్లను ఆమె ఆకాశానికెత్తేస్తోంది. మొత్తానికి టాలీవుడ్ కి వచ్చాక రకుల్ తెలివి బాగా నేర్చేసిందనే అనుకోవాలి మనం!
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)