ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తెలుగు వెర్షన్ పై దృష్టిపెట్టిన విక్రమ్

Thu, Aug 11, 2016
'ఇంకొక్కడు'లో విక్రమ్ - నయనతార
'ఇంకొక్కడు'లో విక్రమ్ - నయనతార
విక్రమ్ కోలీవుడ్ లో స్టార్ హీరో అనిపించుకోకమునుపే, తెలుగులో ఆయన సినిమాలు చేశాడు. స్టార్ హీరో అయ్యాక తన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోను విడుదలయ్యేలా ఆయన శ్రద్ధ తీసుకున్నాడు. ఆయన తాజా చిత్రం 'ఇరుముగన్' కూడా 'ఇంకొక్కడు' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్ పట్ల కూడా విక్రమ్ ప్రత్యేక దృష్టి పెట్టాడట. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను భారీగా జరపాలని ఆయన నిర్మాతలకి చెప్పాడట. తెలుగు ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించాలని అన్నాడని చెబుతున్నారు. అందులోభాగంగా .. ఈ నెల 15వ తేదీన జరగనున్న ఈ సినిమా తెలుగు ఆడియో ఫంక్షన్ కి ఆయన వస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో విక్రమ్ సరసన నయనతార.. నిత్యామీనన్ నటించిన సంగతి తెలిసిందే.
X

Feedback Form

Your IP address: 54.204.247.205
Movie News (Latest)