ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శిరీష్ డైరెక్టర్ కి శర్వానంద్ ఓకే చెప్పేనా?

Thu, Aug 11, 2016
శర్వానంద్
శర్వానంద్
అల్లు శిరీష్ కథానాయకుడిగా వచ్చిన 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో దర్శకుడు పరశురామ్ తో సినిమా చేయడానికి యంగ్ హీరోలంతా ఆసక్తిని చూపుతున్నారు. ఇక గీతా ఆర్ట్స్ వారు పరశురామ్ తో మరో సినిమాను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. తమ తదుపరి సినిమాను వాళ్లు శర్వానంద్ హీరోగా చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

పరశురామ్ ఇప్పటికే శర్వానంద్ కి కథను వినిపించాడట. అయితే శర్వానంద్ నుంచి ఇంకా ఎటువంటి సమాధానం రాలేదని చెబుతున్నారు. ఒకవేళ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, ప్రస్తుతం చేస్తోన్న సినిమాయే కాకుండా .. 'శతమానం భవతి' కూడా పూర్తయిన తరువాత చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి అప్పటివరకూ గీతా ఆర్ట్స్ వాళ్లు ఆగుతారా? మరో హీరోతో లాగించేస్తారా? అనేది చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)