ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శాటిలైట్ రైట్స్: 'మనమంతా'కు భారీ రేటు

Thu, Aug 11, 2016
సినిమా బాగుంటే చిన్న సినిమా అయినా పెద్ద మొత్తంలో శాటిలైట్ రేట్ వస్తోంది. కోట్లకు కోట్లు ఆఫర్ చేసి టీవీ ఛానెల్స్ ఆ హక్కులను సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'మనమంతా' చిత్రానికి కూడా భారీ మొత్తంలో శాటిలైట్ రేటు వచ్చింది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మోహన్ లాల్, గౌతమి జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద అంతగా దూకుడు చూపకపోయినప్పటికీ, శాటిలైట్ హక్కుల రూపంలో మాత్రం మంచి బిజినెస్ చేసింది. తెలుగు, మలయాళం రెండు భాషలకు కలుపుకుని 6.8 కోట్లకు మాటీవీ ఈ రైట్స్ ను సొంతం చేసుకున్నట్టు సమాచారం. బుల్లితెరపై ఈ చిత్రం ఫ్యామిలీలను బాగా ఆకట్టుకుంటుందని, తద్వారా మంచి మార్కెట్ చేసుకోవచ్చని సదరు ఛానెల్ భావించి అంత భారీ మొత్తానికి కమిట్ అయినట్టు చెబుతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.90.95
Movie News (Latest)