ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అలీ హీరోగా 'సంజయ్ రామస్వామి'

Wed, Aug 10, 2016
అలీ
అలీ
అలీ హీరోగా గతంలో యమలీల .. పిట్టలదొర .. ఘటోత్కచుడు వంటి హిట్ చిత్రాలు ప్రేక్షకులను పలకరించాయి. ఆ తరువాత మరికొన్ని సినిమాల్లో హీరోగా చేసిన ఆయన, కామెడీ ప్రధానమైన పాత్రలకే ప్రాధాన్యతనిస్తూ వచ్చాడు. అలాంటి అలీ .. హీరోగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

దర్శకుడు నాగు గవర .. అలీతో ఒక సినిమాను ప్లాన్ చేశాడు. 'సంజయ్ రామస్వామి' .. 'గతం కెలుక్కున్న గజిని' అనేది ట్యాగ్ లైన్. 'గజిని' సినిమాలో సంజయ్ రామస్వామి పేరుతో సూర్య నటించాడు. అప్పటి నుంచి ఈ పేరు బాగా పాప్యులర్ అయింది. దాంతో ఈ టైటిల్ తో నాగు గవర ఓ కామెడీ ఎంటర్టైనర్ ను తెరకెక్కించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తివివరాలు తెలుస్తాయి.
X

Feedback Form

Your IP address: 54.211.207.116
Movie News (Latest)