ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రజనీకాంత్ జీవితచరిత్రను తెరకెక్కించనున్న కూతురు!

Wed, Aug 10, 2016
రజనీకాంత్
రజనీకాంత్
రజనీకాంత్ .. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అనుకరించడానికి సాధ్యం కానీ స్టైల్ .. అసమానమైన నటన ఆయన సొంతం. బస్ కండక్టర్ నుంచి .. సూపర్ స్టార్ గా ఆయన అంచెలంచెలుగా ఎదిగిన తీరు ఎవరినైనా ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఒక సాధారణమైన వ్యక్తి .. అసాధారణమైన శక్తిగా మారడం రజనీకాంత్ విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది.

నటుడిగానే కాదు .. వ్యక్తిత్వం విషయంలోను ఆయన ఎవరెస్టు శిఖరమే. ఆయన జీవితంలో అభిమానులకి తెలియని ఆసక్తికరమైన విషయాలు ఎన్నో వున్నాయి. అందువల్లనే రజనీ జీవితచరిత్రను తెరకెక్కించే ఆలోచనలో ఆయన కూతురు ఐశ్వర్య ఉందనే టాక్ వినిపిస్తోంది. ఆ దిశగా ఆమె సన్నాహాలను కూడా మొదలు పెట్టేసిందని అంటున్నారు. అదే నిజమైతే, ఆ సినిమా మరో ప్రభంజనాన్ని సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)