ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ కోసం వస్తానంటున్న సునీల్

Wed, Aug 10, 2016
సునీల్
సునీల్
మొదటి నుంచి కూడా సునీల్ అవకాశం లభించినప్పుడల్లా చిరంజీవి .. పవన్ కల్యాణ్ లపై తనకి గల అభిమానాన్ని ప్రదర్శిస్తూ వచ్చాడు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ పట్ల తనకి గల వీరాభిమానాన్ని చాటుకున్నాడు. పవన్ కల్యాణ్ అడగాలేగాని, ఆయన కోసం పనిచేయడానికి తాను సిద్ధంగా వున్నానని చెప్పాడు.

ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇలా అన్నాడు. తనకి ఎన్నికలలో నిలబడే ఆసక్తి లేదుగానీ, పవన్ కోసం .. జనసేన పార్టీ కోసం పనిచేయడానికి రెడీగా వున్నానని చెప్పాడు. తాను హీరోగా చేస్తున్నా కమెడియన్ గా చేయనని ఎప్పుడూ ఎవరితోనూ చెప్పలేదని అన్నాడు. చిరంజీవి 150వ సినిమాలో ఆయనతో కలిసి నటించే ఛాన్స్ లభించడం అదృష్టమని చెప్పాడు.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)