ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అఖిల్ కి అనుకున్న కథ నితిన్ కి వెళ్లిందా?

Wed, Aug 10, 2016
నితిన్
నితిన్
అఖిల్ రెండవ సినిమా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కే అవకాశాలు వున్నట్టుగా, ఇటీవల వార్తలు షికారు చేశాయి. కథ రెడీ అయినట్టుగా అఖిల్ కూడా చెప్పాడు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు వీళ్ల కాంబినేషన్లో కుదరలేదు. దాంతో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే మరో వార్త ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. అఖిల్ కి అనుకున్న కథను నితిన్ తో చేస్తే బాగుంటుందనే ఆలోచనలో హను రాఘవపూడి వున్నాడట. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలయ్యాయని చెప్పుకుంటున్నారు. మంచి కథ కోసం .. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కోసం ఎదురుచూస్తోన్న నితిన్, ఈ ఛాన్స్ వదులుకోకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)