ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ప్రేమమ్' రిలీజ్ డేట్ ఖరారైంది

Wed, Aug 10, 2016
'ప్రేమమ్'లో శ్రుతిహాసన్ - నాగచైతన్య
'ప్రేమమ్'లో శ్రుతిహాసన్ - నాగచైతన్య
చందూ మొండేటి దర్శకత్వంలో 'ప్రేమమ్' చిత్రం రూపొందింది. నాగచైతన్య కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, ఆయన సరసన శ్రుతిహాసన్ .. అనుపమ పరమేశ్వరన్ .. మడోనా సెబాస్టియన్ నటించారు. ఈ సినిమా పూర్తయి కొంతకాలమైనా, సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తూ వచ్చింది. ఇప్పటికి ఈ సినిమా విడుదలకి ముహూర్తం కుదిరింది.

ఈ నెల 24వ తేదీన ఆడియో వేడుకను నిర్వహించి, వచ్చేనెల 9వ తేదీన సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. మలయాళ 'ప్రేమమ్'కి ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కింది. అక్కడ సూపర్ హిట్ అయింది కనుక, ఇక్కడ కూడా విజయం తథ్యం అనే నమ్మకంతో వున్నారు. చైతూ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రమవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)