ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భారీరేటుకి 'శ్రీరస్తు శుభమస్తు' శాటిలైట్ రైట్స్

Wed, Aug 10, 2016
'శ్రీరస్తు శుభమస్తు'లో లావణ్య త్రిపాఠి
'శ్రీరస్తు శుభమస్తు'లో లావణ్య త్రిపాఠి
'శ్రీరస్తు శుభమస్తు' టైటిల్ పట్ల ఆడియన్స్ ఆకర్షితులయ్యారు. థియేటర్ కి వెళ్లిన తరువాత సంతృప్తి చెందారు. దాంతో ఈ సినిమా తొలి ఆటతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుని, లాభాల బాటలో దూసుకుపోతోంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, శిరీష్ కి పెద్ద హిట్ ను ఇచ్చింది. ఇక లావణ్య త్రిపాఠి ఖాతాలో మరో సక్సెస్ చేరిపోయింది.

ఈ సినిమా హిట్ చిత్రాల జాబితాలో చేరిపోవడంతో, శాటిలైట్ రైట్స్ కోసం టీవీ ఛానల్స్ ఎగబడ్డాయి. దాదాపు 3 కోట్ల రూపాయల వరకూ చెల్లించి, ఈ సినిమా శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ వారు దక్కించుకున్నారని అంటున్నారు. శిరీష్ సినిమాకి ఈ స్థాయి శాటిలైట్ ధర పలకడం విశేషంగా చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)