ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మెగా హీరోకి హ్యాట్రిక్ హిట్ దక్కేనా?

Wed, Aug 10, 2016
సాయిధరమ్ తేజ్
సాయిధరమ్ తేజ్
సాయిధరమ్ తేజ్ మొదటి నుంచి తనదైన దూకుడు చూపిస్తూ వస్తున్నాడు. మాస్ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆయన చేసిన 'సుబ్రమణ్యం ఫర్ సేల్' .. 'సుప్రీమ్' సినిమాలు ఘనవిజయాలను అందుకున్నాయి. దాంతో ఆయన 'తిక్క' సినిమాతో ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, తనకి తప్పకుండా హ్యాట్రిక్ హిట్ తెచ్చిపెడుతుందనే ఆశతో సాయిధరమ్ తేజ్ వున్నాడు. ఈ సినిమా ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఆయనలో మరింతగా నమ్మకం పెరిగిపోయింది. మరి ఆశించిన విధంగా ఆయన ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతాడో లేదో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)