ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'సేనాపతి'గా మోహన్ బాబు

Wed, Aug 10, 2016
మోహన్ బాబు
మోహన్ బాబు
విలక్షణ నటుడు మోహన్ బాబు రెండు సినిమాల్లో నటించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ రెండూ కూడా తన తనయులతో కలసి నటించేవే కావడం ఇక్కడ విశేషం. ఈ విషయాన్ని మోహన్ బాబు స్వయంగా ప్రకటించారు. వీటిలో ముందుగా పెద్ద కొడుకు మంచు విష్ణుతో కలసి నటించే చిత్రం మొదలవుతుంది. ఈ చిత్రానికి 'సేనాపతి' అనే టైటిల్ని కూడా నిర్ణయించినట్టు మోహన్ బాబు తెలిపారు. ఇది త్వరలో సెట్స్ కి వెళుతుంది.
ఇక చిన్న కొడుకు మంచు మనోజ్ తో కలసి నటించే చిత్రం మాత్రం వచ్చే ఏడాది మొదలవుతుంది. ఈ రెండు చిత్రాలూ కూడా వీరి సొంత సంస్థ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటాయి. ఆయా చిత్రాలకు దర్శకులు ఎవరు? కథానాయికలు ఎవరు? అన్న విషయాలను త్వరలో ప్రకటిస్తారు.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)