ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'శ్రీరస్తు శుభమస్తు'కి కొత్త సీన్స్

Tue, Aug 09, 2016
'శ్రీరస్తు శుభమస్తు'లో అల్లు శిరీష్
'శ్రీరస్తు శుభమస్తు'లో అల్లు శిరీష్
అల్లు శిరీష్ కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో అన్ని ప్రాంతాల్లోను భారీ వసూళ్లను సాధిస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాకి మరికొన్ని సీన్స్ ను జోడించనున్నారు. ఈ విషయాన్ని అల్లు శిరీష్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఈ సినిమాకి ప్రేక్షకుల ఆదరణ లభిస్తూ ఉండటంతో, ఎడిటింగులో తొలగించిన కొన్ని మంచి సీన్స్ ను కలపబోతున్నామని చెప్పాడు. ఆ సీన్స్ ఆడియన్స్ కి బాగా నచ్చుతాయనే నమ్మకం ఉందనీ, గురువారం నుంచి అన్ని థియేటర్లలో కొత్త సీన్స్ తో కూడిన సినిమాను చూడవచ్చని అన్నాడు.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)