ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎన్టీఆర్ మూవీకి రెండు క్లైమాక్సులా?

Tue, Aug 09, 2016
'జనతా గ్యారేజ్' లో ఎన్టీఆర్
'జనతా గ్యారేజ్' లో ఎన్టీఆర్
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' సినిమా రూపొందింది. సెప్టెంబర్ 2న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించిన ఒక వార్త ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తోంది. 'జనతా గ్యారేజ్' సినిమాకి రెండు క్లైమాక్స్ లు ఉంటాయనేది ఆ వార్త సారాంశం.

ఎన్టీఆర్ క్రేజ్ కి తగిన విధంగా తెలుగులో ఒక క్లైమాక్స్ ను చిత్రీకరించారు. ఇక మలయాళ వెర్షన్ లో మోహన్ లాల్ పాత్రను హైలైట్ చేస్తూ మరో క్లైమాక్స్ ను చిత్రీకరించినట్టు చెప్పుకుంటున్నారు. గతంలో దళపతి .. ఘర్షణ .. ఏ మాయ చేసావే వంటి సినిమాలు, వేరు వేరు క్లైమాక్స్ లతో విడుదలై సక్సెస్ ను సాధించాయి. మరి 'జనతా గ్యారేజ్' కూడా ఆ సినిమాల జాబితాలో చేరుతుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)