ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'హీరోయిన్స్ ని వెతికి పట్టుకుంటాం'- వెంకీ

Tue, Aug 09, 2016
వెంకటేశ్
వెంకటేశ్
'బాబు బంగారం' సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో వెంకటేశ్ చాలా బిజీగా వున్నారు. ఈ ప్రమోషన్లో భాగంగా ఆయన మాట్లాడుతూ ఉండగా, సీనియర్ హీరోలకి హీరోయిన్స్ దొరకడం లేదు కదా? అనే ప్రశ్న ఎదురైంది. అప్పుడాయన తనదైన శైలిలో స్పందిస్తూ, హీరోయిన్స్ ఊరికే దొరుకుతారా? అంటూ నవ్వేశారు.

అయినా ఇప్పుడు నా వయసెంతా? ఆ విషయాన్ని గురించి ఆలోచించుకోవాలిగా .. ఎప్పుడైనా సత్యాన్ని అంగీకరించవలసిందేనని అన్నారు. హీరోయిన్స్ దొరక్కపోయినా కష్టపడి వెతికి పట్టుకుంటాం.. తప్పదు గదా. అయినా ఏ సినిమాకైనా ముందు మంచి స్క్రిప్ట్ దొరకాలి .. ఆ తరువాత హీరోయిన్స్ ఎలాగో దొరుకుతారని అన్నారు. ఇక 'బాబు బంగారం'లో తాను ముందు సరదాగా కనిపించి, ఆ తరువాత సీరియస్ గా రంగంలోకి దిగే పోలీస్ పాత్రలో కనిపిస్తాననీ, ఈ తరహా పాత్ర చేయడం కొత్తగా అనిపించిందని చెప్పారు.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)