ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జ్యో అచ్యుతానంద' టైటిల్ లోగో రిలీజ్

Tue, Aug 09, 2016
నటుడిగా ప్రేక్షకులను అలరించిన అవసరాల శ్రీనివాస్, 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో ఒక్కసారిగా దర్శకుడిగా మారిపోయాడు. ఈ సినిమా యూత్ ను విపరీతంగా ఆకట్టుకోవడంతో, మరో సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నంలో ఆయన వున్నాడు. ఈ సినిమాకి 'జ్యో అచ్యుతానంద' అనే టైటిల్ ను ఖరారు చేసిన ఆయన, తాజాగా ఈ టైటిల్ లోగోను రిలీజ్ చేశాడు.

ఈ సినిమాలో కథానాయికగా రెజీనా నటిస్తుండగా, కథానాయకులుగా నారా రోహిత్ .. నాగశౌర్య కనిపించనున్నారు. కథానాయిక పాత్ర పేరు జ్యోత్స కాగా .. కథానాయకుల పాత్రల పేర్లు అచ్యుత్ .. ఆనంద్. అందువలన ఈ సినిమాకి ఈ టైటిల్ ను పెట్టారు. టైటిల్ లోగోను అందంగాను .. ఆహ్లాదకరంగాను డిజైన్ చేయించారు. త్వరలో ఆడియో వేడుకను నిర్వహించి, సెప్టెంబర్లో సినిమాను విడుదల చేయనున్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)