ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వెయ్యి రూపాయల కోసం సమంత పాట్లు!

Tue, Aug 09, 2016
సమంత
సమంత
ఈవేళ కోట్లలో పారితోషికం తీసుకుంటున్న చెన్నయ్ బ్యూటీ సమంత చిన్నప్పటి నుంచీ కూడా కష్టపడేదట. పద్నాలుగేళ్ల వయసు నుంచీ తన అవసరాల కోసం ఏదో ఒక పనిచేసి అంతో ఇంతో సంపాదించుకునేదట. ఈ విషయాన్ని తాజాగా తనే వెల్లడించింది. "డబ్బుల కోసం చిన్న చిన్న పనులు చాలా చేసేదాన్ని. నాకు పద్నాలుగేళ్ల వయసున్నప్పుడు పెళ్లిళ్లలో రిసెప్షన్ దగ్గర కూడా పనిచేసేదానిని. అతిథులను ఆహ్వానిస్తూ పన్నీరు జల్లే ముగ్గురు, నలుగురు అమ్మాయిల్లో ఒకరిగా నిలబడేదానిని. అలా మూడు గంటల పాటు చిర్నవ్వు చిందిస్తూ... కష్టపడి నిలబడితే వెయ్యి రూపాయలు వచ్చేవి. అలా పనిచేయడానికి నేను ఏమాత్రం సిగ్గుపడేదానిని కాదు. కష్టపడి సంపాదించుకుంటున్నానని గర్వంగా వుండేది. ఆ వెయ్యి రూపాయలను ఎంతో మురిపెంగా దాచుకునే దానిని. ఇప్పుడు ఇంత సంపాదిస్తున్నా ఆ కిక్కు మాత్రం రావడం లేదు" అంటూ చెప్పుకొచ్చింది సమంత.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)