ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రజనీతో నటించే ఛాన్స్ వస్తే చాలట!

Mon, Aug 08, 2016
జాక్వెలిన్ ఫెర్నాండెజ్
జాక్వెలిన్ ఫెర్నాండెజ్
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ .. యూత్ కి ఉత్సాహాన్ని కలిగించే పేరు .. హుషారెత్తించే పేరు. బాలీవుడ్ సినిమాలను చాలా కాలంగా చేసుకుంటూ వస్తోన్న ఈ సుందరికి, ఇప్పుడిప్పుడే సరైన సినిమాలు పడుతున్నాయి. దాంతో పెద్ద హీరోల సరసన నటించే అవకాశాలను అందిపుచ్చుకుంటూ వస్తోంది.

ఈ నేపథ్యంలోనే రజనీకాంత్ తో నటిస్తే చాలంటూ తన మనసులోని కోరికను బయటపెట్టింది. ఇటీవల కాలంలో విభిన్నమైన సినిమాలు చేసే అవకాశం దక్కినందుకు తనకి ఎంతో ఆనందంగా వుందని ఆమె చెప్పింది. తనకి లభిస్తోన్న పాత్రల పట్ల తాను చాలా సంతోషంగా వున్నానని అంది. అయితే అసలైన ఆనందం కలిగేది, రజనీకాంత్ తో కలిసి నటించే అవకాశం వచ్చినప్పుడే అంటూ అసలు విషయాన్ని వెల్లడించింది. మరి ఆమె ముచ్చట ఎప్పుడు తీరుతుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 50.16.52.237
Movie News (Latest)