ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎన్టీఆర్, బన్నీలతో చేయాలనుకున్నారట!

Mon, Aug 08, 2016
ఎన్టీఆర్
ఎన్టీఆర్
కల్యాణ్ రామ్ .. సాయిధరమ్ తేజ్ కథానాయకులుగా ఒక మల్టీ స్టారర్ రూపొందనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ప్రాజెక్టు గురించిన ఒక టాక్ తాజాగా షికారు చేస్తోంది. ఎన్టీఆర్ .. అల్లు అర్జున్ లతో ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు ఒక మల్టీ స్టారర్ సినిమా చేయాలని అనుకున్నారట. దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి ఈ ఇద్దరికీ కథ కూడా వినిపించాడట.

అయితే కారణమేంటో తెలియదుగానీ ఈ ఇద్దరూ కూడా పెద్దగా ఆసక్తిని కనబరచలేదని అంటున్నారు. దాంతో అటు నందమూరి ఫ్యామిలీ నుంచి కల్యాణ్ రామ్ ను .. ఇటు మెగా ఫ్యామిలీ నుంచి సాయిధరమ్ తేజ్ ను సంప్రదించడం జరిగిందని చెప్పుకుంటున్నారు. ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.167.129.169
Movie News (Latest)