ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఆడాళ్లూ మీకు జోహార్లు' అంటోన్న వెంకటేశ్

Mon, Aug 08, 2016
వెంకటేశ్
వెంకటేశ్
వెంకటేశ్ కథానాయకుడిగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనున్నట్టు ఈ మధ్య వార్తలు షికారు చేశాయి. అదే సమయంలో వెంకీ ఒక రీమేక్ కూడా చేయనున్నాడనే వార్తలు కూడా రావడంతో ఈ సినిమాల పట్ల కాస్త కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఈ రెండూ ఒకటేనా? లేక వేర్వేరా? అన్న డౌటు చాలామందికి వస్తోంది.

ఈ క్రమంలో తాజాగా 'బాబు బంగారం' ప్రమోషన్లో భాగంగా వెంకటేశ్ మాట్లాడుతూ, కిషోర్ తిరుమలతో తన సినిమా ఉందని చెప్పారు. 'ఆడవాళ్లూ మీకు జోహార్లు' పేరిట ఇది తెరకెక్కనుందని స్పష్టం చేశారు. అలాగే, 'ఇరుదు సుట్రు' అనే రీమేక్ ను కూడా చేయనున్నట్టు ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఇక వెంకటేశ్ నయనతార జంటగా నటించిన 'బాబు బంగారం' ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సినిమా కథ .. కథనాలు ఆసక్తికరంగా ఉంటాయనీ, తన పాత్ర అందరికీ బాగా నచ్చుతుందని వెంకటేశ్ అన్నారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 50.16.52.237
Movie News (Latest)