ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

డబ్బింగ్ రైట్స్ 18 కోట్లు... షాక్ ఇచ్చిన సూర్య!

Mon, Aug 08, 2016
తమిళ హీరో సూర్య మరోసారి టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆయన నటిస్తున్న తమిళ చిత్రం 'సింగం 3' తెలుగు డబ్బింగ్ రైట్స్ ఏకంగా 18 కోట్లకు అమ్ముడుపోవడంతో ఈ వార్త ఇప్పుడు పెద్ద సంచలనం అయింది. హరి దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతున్న 'సింగం 3' చిత్రానికి మొదటి నుంచీ అటు తమిళంలోనే కాకుండా, ఇటు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది. దాంతో తెలుగు డబ్బింగ్ హక్కుల కోసం పోటీ ఏర్పడింది.

ఈ క్రమంలో సురక్ష్ ఎంటర్ టైన్మెంట్ మీడియా అధినేత మల్కాపురం శివకుమార్ ఈ హక్కులను పద్దెనిమిది కోట్లు ఆఫర్ చేసి సొంతం చేసుకున్నట్టు తాజా సమాచారం. మొదట్లో వచ్చిన 'సింగం' సీరీస్ లోని మొదటి రెండు సినిమాలు మంచి హిట్టయ్యాయి. దాంతో 'సింగం 3' కూడా బాగా హిట్టవుతుందని, మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని లెక్కలు వేసుకుని నిర్మాత శివకుమార్ అంతటి స్థాయిలో ఈ హక్కులకు వెచ్చించారని అంటున్నారు. ఏమైనా, ఒక తమిళ హీరో సినిమా తెలుగులో ఇంతటి మార్కెట్టును సంపాదించుకోవడం గ్రేట్ అనే చెప్పాలి!
X

Feedback Form

Your IP address: 54.161.168.21
Movie News (Latest)