ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'బిచ్చగాడు' దర్శకుడికి వెంకీ గ్రీన్ సిగ్నల్!

Sun, Aug 07, 2016
వెంకటేశ్
వెంకటేశ్
ఇటీవలి కాలంలో డబ్బింగ్ సినిమాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి, కలెక్షన్ల వర్షం కురిపించిన ఘనతను 'బిచ్చగాడు' చిత్రం దక్కించుకుంది. ఆ సినిమా కాన్సెప్టుకి, దర్శకుడి టేకింగ్ కి ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. దీంతో ఈ చిత్ర దర్శకుడు శశితో చేయడానికి పలువురు టాలీవుడ్ హీరోలు ఆసక్తి చూపించారు. వీరిలో ప్రముఖ హీరో వెంకటేశ్ కూడా వున్నారు. దీంతో ఇటీవల దర్శకుడు శశి ఈయనను కలసి ఓ స్టోరీ చెప్పాడని, వెంకీ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ క్రమంలో పూర్తి స్క్రిప్టును తయారుచేసుకునే పనిలో దర్శకుడు శశి ఉన్నాడని అంటున్నారు. ఇదిలా ఉంచితే, త్వరలో 'బాబు బంగారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న వెంకటేశ్, దీని తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)