ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అలా ఈ మల్టీస్టారర్ ఓకే అయిందట!

Sun, Aug 07, 2016
కల్యాణ్ రామ్
కల్యాణ్ రామ్
నందమూరి హీరో కల్యాణ్ రామ్ .. మెగాహీరో సాయిధరమ్ తేజ్ కథానాయకులుగా ఒక మల్టీ స్టారర్ రూపొందనున్నట్టు ఒకటి రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మల్టీ స్టారర్ ఓకే కావడానికి కారకుడు కల్యాణ్ రామ్ అని తెలుస్తోంది. దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి ఇటీవల కల్యాణ్ రామ్ ను కలిసి ఒక కథ వినిపించాడట. ఆ కథ తనకి బాగా నచ్చిందని కల్యాణ్ రామ్ చెప్పాడు.

ఆ కథలో మాస్ హీరో చేయవలసిన మరో పాత్ర ఉండటంతో, ఆ పాత్రని సాయిధరమ్ తేజ్ చేస్తేనే బాగుంటుందని రవికుమార్ చౌదరితో కల్యాణ్ రామ్ అన్నాడట. దాంతో ఆయన వెళ్లి సాయిధరమ్ తేజ్ కి కథ వినిపించి, కల్యాణ్ రామ్ అభిప్రాయం కూడా చెప్పాడు. ఎంతమాత్రం సందేహించకుండా వెంటనే సాయిధరమ్ తేజ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని చెబుతున్నారు. అలా ఈ మల్టీ స్టారర్ కి రంగం సిద్ధమైందన్నమాట.
X

Feedback Form

Your IP address: 50.16.107.222
Movie News (Latest)