ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్, వెంకీలతో త్రివిక్రమ్ మల్టీ స్టారర్?

Sun, Aug 07, 2016
త్రివిక్రమ్
త్రివిక్రమ్
పవన్ కల్యాణ్ .. వెంకటేశ్ కథానాయకులుగా గతంలో 'గోపాల గోపాల' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సమయంలోనే దర్శకుడు 'డాలీ'తో మరో సినిమా చేస్తానని పవన్ మాట ఇచ్చాడట. అన్నమాట ప్రకారం ప్రస్తుతం ఆయన 'డాలీ'తో ఒక సినిమా చేస్తున్నాడు.

అలాగే 'గోపాల గోపాల' సినిమా సమయంలోనే, మళ్లీ ఒకసారి వెంకటేశ్ తో కలిసి నటించాలని పవన్ అనుకున్నాడట. ఇటీవల ఆయన ఆ విషయాన్ని త్రివిక్రమ్ చెవిన వేశాడు. వెంకటేశ్ కామెడీ టైమింగ్ ను బాగా ఇష్టపడే త్రివిక్రమ్, ఈ కాంబినేషన్ పట్ల ఆసక్తిని చూపాడని చెబుతున్నారు. పవన్ .. వెంకటేశ్ ల మల్టీ స్టారర్ కోసం ఆయన ఒక కథను సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. అంతా అనుకున్నట్టుగా జరిగితే, త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)