ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Sun, Aug 07, 2016
రకుల్
రకుల్
* మహేశ్ బాబు, మురుగదాస్ కాంబినేషనల్ లో రూపొందుతున్న తాజా చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే. కాగా, ఈ నెల 11న ఈ చిన్నది ఈ సినిమా షూటింగులో జాయిన్ అవుతుందట. మహేశ్ బాబుతో సినిమా చేయాలని కలలు కంటున్న ఈ ముద్దుగుమ్మ కథ కూడా అడగకుండానే ఈ చిత్రానికి ఓకే చెప్పేసింది.
* కథానాయిక అమలాపాల్, దర్శకుడు ఏ.ఎల్. విజయ్ జంట నిన్న చెన్నయ్ లోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. విశేషం ఏమిటంటే, భర్త నుంచి తనకు భరణం ఇప్పించమని అమలా పాల్ న్యాయస్థానాన్ని కోరలేదట.
* తాజాగా అల్లు శిరీష్ హీరోగా 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు పరశురామ్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్నాడు. త్వరలో ఆ చిత్రం వివరాలను వెల్లడిస్తాడట.
* మహేశ్ బాబు సినిమా కోసం శ్రీదేవి తనయ జాహ్నవిని సంప్రదించినట్టు, శ్రీదేవి అందుకు తిరస్కరించినట్టు ఇటీవల వార్తలొచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే, అసలు జాహ్నవి కోసం తాము సంప్రదించలేదని, కేవలం పరిణితి చోప్రాను మాత్రమే సంప్రదించామని, చివరికి రకుల్ ను తీసుకున్నామని ఈ సినిమా టీమ్ తెలిపింది.
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)