ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆ విధంగా సునీల్ మిస్సయ్యాడట!

Sat, Aug 06, 2016
సునీల్
సునీల్
కథ విని అది ఒప్పుకోవడమా? తిరస్కరించడమా? అన్నది హీరోలకు కత్తిమీద సాము లాంటిది. మనం సూపర్ హిట్టవుతుందనుకున్న సినిమా అట్టర్ ఫ్లాపవ్వచ్చు. ఫ్లాపవుతుందనుకున్నది సూపర్ హిట్టవ్వచ్చు. ఈ విషయంలో ఆయా హీరోల అంచనాలు ఒక్కోసారి తప్పుతుంటాయి. ఇక రీమేక్ ల విషయానికొస్తే, ఒక భాషలో హిట్టయిన చిత్రాన్నే మరో భాషలో రీమేక్ చేస్తారు. అందుకే, చాలా మంది హీరోలు రీమేక్ అనగానే ఆలోచించకుండా ఒప్పేసుకుంటారు.

అయితే, ఈమధ్య కామెడీ స్టార్ సునీల్ మాత్రం ఓ చిత్రం విషయంలో బోల్తాపడ్డాడు. అదే 'బిచ్చగాడు' సినిమా! తమిళనాట 'పిచ్చైకారన్' పేరిట రిలీజై ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసే ముందు రీమేక్ చేద్దామన్న ఉద్దేశంతో సునీల్ కి చూపించారట. అయితే, ఆయన తనకు నచ్చలేదని రిజక్ట్ చేశాడట. ఆ పాత్రలో తనను ప్రేక్షకులు ఆదరించరన్న అనుమానంతో ఆయన రిజక్ట్ చేశాడు. దాంతో నిర్మాతలు దానిని డబ్ చేశారు. తర్వాత అదిప్పుడు ఎంతటి భారీ విజయాన్ని నమోదు చేసిందో, ఎన్ని కోట్లు రాబట్టిందో మనకు తెలిసిందే!
X

Feedback Form

Your IP address: 54.158.119.60
Movie News (Latest)