ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ధనుష్ సరసన రాధికా ఆప్టే!

Sat, Aug 06, 2016
రాధికా ఆప్టే
రాధికా ఆప్టే
రాధికా ఆప్టే ఆ మధ్య కొన్ని తమిళ చిత్రాల్లో నటించింది. అయితే అవి కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో, ఆమెకి అక్కడ అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే 'కబాలి'లో వేషం వెతుక్కుంటూ వచ్చింది. రజనీ భార్యగా ఆమె నటించిన ఈ సినిమా, ఒక రేంజ్ లో వసూళ్లు రాబట్టింది.

దాంతో ఒక్కసారిగా ఆమె క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు అక్కడ ఆమెకి వరుసగా అవకాశాలు వస్తున్నాయట. అలాగే రజనీ అల్లుడు ధనుష్ కూడా తన సొంత సినిమాలో ఆమెకి ఛాన్స్ ఇచ్చాడు. ధనుష్ నిర్మిస్తూ నటిస్తోన్న ఓ సినిమాలో ఆమెను కథానాయికగా తీసుకున్నాడట. ఈ సినిమా కూడా హిట్ అనిపించుకుంది అంటే, ఇక కోలీవుడ్ లో కొంతకాలం పాటు రాధికా హవా కొనసాగినట్టే!
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)